Friday, May 17, 2024

తెలంగాణలో 25 లక్షల మంది సూపర్​ స్ప్రెడర్లు!..వారికి త్వరలోనే వ్యాక్సిన్లు..

తెలంగాాణలో కరోనా సూపర్ స్ప్రెడర్లను గుర్తుంచి పనిలో పడింది ప్రభుత్వం. వీధి వ్యాపారుల దగ్గర్నుంచి కూరగాయలు అమ్మే వారు కరోనా సూపర్ స్ప్రెడర్లుండే అవకాశం ఉందని తెలంగాణ సర్కార్ అనుకుంటోంది. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల మంది దాకా సూపర్ స్ప్రెడర్లుంటారని అంచనా వేస్తోంది. డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్ , ఫుడ్ డెలివరీ బాయ్స్, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారు సూపర్ స్ప్రెడర్లు అయ్యే అవకాశం ఉందని, వారందరికీ వ్యాక్సిన్ వేయాలని భావిస్తోంది. దీనిపై అన్ని జిల్లాల్లోనూ సూపర్ స్ప్రెడర్లను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్లు కసరత్తులు ప్రారంభించారు. మూడు నాలుగు రోజులో జిల్లాల్లోని సూపర్ స్ప్రెడర్లపై నివేదిక తయారు చేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా వారికి టీకా ఎలా ఇవ్వాలన్న దానిపై నిర్ణయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement