Friday, May 17, 2024

Story : ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేసిన మార్గ‌రేట్ అల్వా- ఈమె ఎవ‌రో తెలుసా

ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి పోటీ చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి మార్గ‌రేట్ అల్వా నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈమె విప‌క్ష పార్టీల త‌ర‌పున ఈ ప‌ద‌వికి పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ చీఫ్ , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ , రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగష్టు 6వ తేదీన Vice President పదవికి పోలింగ్ జరగనుంది. ఈ ఏడాది ఆగష్టు 10వ తేదీన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం పూర్తి కానుంది. ఆగష్టు 6న ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతాయి. నిన్ననే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 21న ఉప రాష్ట్రపతి పదవికి జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున ద్రౌపది ముర్ము బరిలోకి దిగారు. విపక్ష పార్టీల తరపున మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. ఈ నెల 17న న్యూఢిల్లీలో సమావేశమైన విపక్ష పార్టీలు మార్గరెట్ అల్వాను ఉపరాష్ట్రపతి పదవికి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నాయి.

న్యూఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో సమావేశమైన విపక్షాలు మార్గరెట్ అల్వాను ఉప రాష్ట్రపతి పదవికి బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నాయి. NDA తరపున ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ కర్ పోటీ చేస్తున్నారు. జగదీఫ్ ధన్ కర్ సోమవారం నాడు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. జగదీష్ ధన్ కర్ నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు పాల్గొన్నారు. మార్గరెట్ అల్వా వయస్సు 80 ఏళ్లు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాదు పలు రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. రాజస్థాన్ ,గోవాతో పాటు పలు రాస్ట్రాల్లో ఆమె గవర్నర్ గా పనిచేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మార్గరెట్ అల్వా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఉప రాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలు ఓ చాలెంజ్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ సవాల్ ను స్వీకరించేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా ఆమె ప్రకటించారు తనను విపక్ష పార్టీలు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని ఎంపిక చేసినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement