Saturday, May 18, 2024

దుల్క‌ర్ స‌ల్మాన్ సీతారామం – గ్లింప్స్ రిలీజ్

ప్రస్తుతం మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో.. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఇదివ‌ర‌కే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌లు ఈ సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచాయి. శ్రీరామ‌న‌వ‌మీ సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఇది ఓ సైనికుడు శ‌త్రువుకు అప్ప‌గించిన యుద్ధం అఫ్రీన్. ఈ యుద్ధంలో సీతారాముల‌ను నువ్వే గెలిపించాలి’అంటూ సుశాంత్ వాయిస్ ఓవ‌ర్‌తో మొద‌లైన గ్లింప్స్ ఆక‌ట్టుకుంటుంది. ‘సీతారాములా ? ఎవ‌రు వాళ్ళు’ అంటూ ర‌ష్మిక ప‌లికే సంభాష‌ణతో దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృనాల్ తాకూర్‌లు ప‌రిచ‌య‌మ‌వుతారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. ‘సీతారామం’గా ఈ చిత్ర టైటిల్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement