Friday, May 17, 2024

యూట్యూబ‌ర్ శ్రియా ముర‌ళీధ‌ర్ హ‌ఠాత్త్ మ‌ర‌ణం ..

యూట్యూబ్ ద్వారా ఎంతో గుర్తింపు పొందింది శ్రియా ముర‌ళీధ‌ర్. కాగా ఆమె హ‌ఠాత్త్ మ‌ర‌ణం చెందింది. ఆమె వ‌య‌సు 27. దాంతో ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం వ్య‌క్తం చేశారు. నటన అంటే ఎంతో ఇష్టపడే శ్రియ మురళీధర్ స్వస్థలం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్. యాంకర్ ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ రియాలిటీ షోలో శ్రియ మురళీధర్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ‘బ్యూటీ అండ్ ద బాస్’ సీజన్ 2లోనూ శ్రియా మురళీధర్ ఓ పాత్రలో నటించింది. అనంతరం యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిలింలో నటించి మంచి పేరు సంపాదించింది. శ్రియా మురళీధర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement