Saturday, April 27, 2024

అక్టోబర్ 20 నుంచి షర్మిల పాదయాత్ర

తెలంగాణలో పాదయాత్రకు సిద్దమవుతున్నారు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి యాత్ర ప్రారంభం కానున్నట్లు షర్మిల తెలిపారు. కాగా ఏడాది పాటు కొనసాగుతుందని.. మళ్లీ చేవేళ్లలోనే ముగిస్తామని వెల్లడించారు. మొత్తం 90 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.. తెలంగాణలో అన్ని పార్టీలు అమ్ముడు పోయాయని ఆరోపిస్తున్న షర్మిల.. టీఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటున్నారు.. వైఎస్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన చేవెళ్ల నుంచే యాత్ర ప్రారంభిస్తున్నాం.. పాదయాత్రలో బ్రేక్‌లు ఉండవని ప్రకటించిన వైఎస్‌ షర్మిల.. ఏడాదిపాటు పాదయాత్ర కొనసాగుతుంది.. చేవెళ్లలో ప్రారంభమై.. చేవెళ్లలోనే ముగిస్తామని తెలిపారు.

గతంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు కొనసాగింపుగా.. కొన్ని రోజుల పాటు పాదయాత్ర చేశారు షర్మిల.. ఇప్పుడు.. తెలంగాణలో రాజన్న రాజ్యం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటు చేసిన ఆమె.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు.. ఇప్పటికే ప్రతీవారం నిరుద్యోగ దీక్ష కొనసాగిస్తూ వస్తున్న ఆమె.. ఇక, వచ్చే నెల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.. ఇవాళ తన పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించారు షర్మిల. తన తండ్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గతంలో చేవేళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించారు.. ఆయన పాదయాత్ర కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో దోహదం చేసింది.. ఇక, వైఎస్‌ షర్మిల కూడా నాన్నకు కలిసివచ్చిన చేవెళ్ల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికలపై మరింత విశ్లేషణ చేయాలి: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement