Tuesday, May 21, 2024

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు క‌న్నుమూత – సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తాతినేని రామారావు క‌న్నుమూశారు. కాగా ఆయ‌న వ‌య‌సు 84సంవ‌త్స‌రాలు. కృష్ణా జిల్లా కపిలేశ్వరపురానికి చెందిన రామారావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1966లో ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన తాతినేని 70కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో యమగోల, జీవనతరంగాలు, దొరబాబు, ఆలుమగలు, అనురాగదేవత, న్యాయానికి సంకెళ్లు వంటి సూపర్ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే, రాజేంద్రప్రసాద్‌తో గోల్‌మాల్ గోవిందం, సూపర్‌స్టార్ కృష్ణతో అగ్నికెరటాలు వంటి సినిమాలను తెరకెక్కించారు. తాతినేని మృతికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement