Saturday, April 27, 2024

మైఖేల్ గా సందీప్ కిష‌న్..విల‌న్ గా స్టార్ డైరెక్ట‌ర్..

త‌మిళ స్టార్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి హీరోగా ఓ ప‌క్క‌..విల‌న్ గా మ‌రోప‌క్క న‌టిస్తున్నాడు. కాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న మైఖేల్ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో మెర‌వ‌నున్నాడ‌ట‌. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. కాగా ఈ మూవీకి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నాడు… శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, కరణ్ సి ప్రొడక్షన్ ఎల్ఎల్పి బ్యానర్లపై నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణంలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టైటిల్ పోస్టర్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఇందులో విలన్ పాత్రలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటిస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గౌతమ్ మీనస్ ఫేస్ రివీల్ చేయకుండా ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం. అందులో రక్తం కారుతున్న చేతికి బేడీలు వేసి ఉండటాన్ని చూడవచ్చు. గౌతమ్ మీనస్ ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్‍గా కొనసాగుతున్నారు. ప్రేమకథలతోపాటు.. యాక్షన్ సినిమాలను రూపొందిస్తూ సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్నారు గౌతమ్ మీనన్. ఇక ఈ సినిమాలో భారీ స్థాయిలోనే నటీనటులు నటించనున్నట్లుగా స‌మాచారం.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement