WAR: రష్యా వర్సెస్​ యుక్రెయిన్​.. డోనెస్కో, లూహాన్స్క్​ స్వతంత్ర స్టేట్స్​గా ప్రకటన..

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు పుతిన్​ యుక్రెయిన్​ వద్ద అణుబాంబు ఉందని ఆరోపించారు. కొన్ని దేశాల మద్దతుతో రష్యాపై యుక్రెయిన్​ దాడి చేసే అవకాశం ఉందన్నారు. ఆ దేశం ప్రస్తుతం ఇతరుల చేతిలో కీలు బొమ్మగా మారిందన్నారు. వారికి నాటో హెడ్​ క్వార్టర్స్​ నుంచి ఆదేశాలు అందుతున్నాయన్నారు. రష్యా బలహీనతను కోరుకుంటున్న అమెరికా యుక్రెయిన్​ని పావుగా వాడుకుంటోందని ఆరోపించారు పుతిన్​. అయితే తమపై దాడికి దిగితే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. డోనెస్కో, లూహాన్స్​కుని స్వతంత్ర స్టేట్​గా ప్రకటించారు పుతిన్​. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే రెండు ప్రాంతాలకు రష్యాన్​ ఆర్మీ వెళ్లాలని ఆదేశించారు.

ఇక ఈ రెండు ప్రాంతాలకు రష్యన్​ బలగాలు వెళ్లనున్నాయి. ఇకమీదట యుక్రెయిన్​ తమకు పొరుగు దేశం మాత్రమే కాదని, రష్యా చరిత్రలో భాగమన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్​. డాన్​బాస్​లో రష్యన్లకు వ్యతిరేకంగా యుక్రెయిన్​ యుద్ధం చేయాలని అనుకుంటోందని విమర్శించారు. డాన్​బాస్​లో ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని, నాటోలో యుక్రెయన్​ చేరికను రష్యాకు ప్రత్యక్ష ముప్పగా పేర్కొన్నారు. యుక్రెయిన్​లో అధికారంలో ఉన్న వారిని రాడికల్ టెర్రర్​​ గ్రూపులుగా అభివర్ణించిన పుతిన్​ వారిని శిక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు.

Advertisement