Monday, March 4, 2024

RRR: ప్రపంచవ్యాప్తంగా RRR మేనియా.. ట్విట్టర్ రివ్యూ ఎంటంటే..

తెలుగు రాష్ట్రాల్లో RRR మేనియా నెలకొంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడులైంది. ఇందులో అల్లూరిగా చరణ్, కొమరం భీంగా తారక్ పాత్రలను పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయ ముఖ్యపాత్రల్లో నటించారు. తెలుగురాష్ట్రాలు సహా చాలా చోట్ల ఇప్పటికే షోలు పడ్డాయి. బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలతో హైద్రాబాద్ మొత్తం ఆర్ఆర్ఆర్ మయం అయిపోయింది. ఏఎంబీ మాల్ లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సినిమా చేశారు. ఇక, కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లలో రామ్ చరణ దంపతులు సినిమా చూశారు.

ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల వద్ద ఎన్టీఆర్, రామ్ చరణ అభిమానులు హంగామా చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ ఇప్పటికే అమెరికా సహా ఎన్నో ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుంది. అన్ని చోట్లా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. అభిమానులు తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలైయ్యాయని అంటున్నారు. రామ్ చరణ్,ఎన్టీఆర్ అదరగొట్టేశారు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement