Monday, June 17, 2024

సింగరేణి గనిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

సింగరేణి గనిలో  జరిగిన ప్రమాదంలో 18 గంటలు గడిచినా నలుగురు జాడ తెలియడం లేదు. సోమవారం మధ్యాహ్నం పెద్దపెల్లి జిల్లా  అడ్రియాల గని లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అధికారులతో సహా ఏడుగురికి చిక్కుకోగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వీరయ్య, వెంకటేష్ లను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి రెండున్నర తర్వాత తీవ్రంగా శ్రమించి నరేష్ ను బయటకు తీసుకువచ్చారు. 18 గంటలుగా శ్రమిస్తున్నా సేఫ్టీ అధికారి జయరాజ్ అండర్ మేనేజర్ చైతన్య తేజ్ బదిలీ కార్మికుడు రవీందర్ తో పాటు శ్రీకాంత్ జాడ తెలియక పోవడం తో పాటు సింగరేణి అధికారులతో పాటు కార్మికులు ఆందోళన పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement