Friday, April 26, 2024

Breaking: రాజగోపాల్​రెడ్డి రాం రాం.. పార్టీకీ, పదవికి రాజీనామా!

ఇదిగో, అదుగో అంటూ నాన్చుతూ వ‌స్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎట్ట‌కేల‌కు ఇవ్వాల పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. త‌న రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే దానికి సిద్ధంగా ఉన్నాన‌న్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై, రాష్ట్ర నాయ‌క‌త్వంపై ప‌లుమార్లు రాజ‌గోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్య‌లు చేసి షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నారు.

ఈ మ‌ధ్య‌కాలంలో ఆయ‌న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్టు వార్త‌లు కూడా బ‌య‌టికి వ‌చ్చాయి. దీంతో పార్టీ మారుతున్నార‌నే వాద‌న‌లు వినిపించాయి. అయితే.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని, పార్టీ మార‌బోన‌ని ఈ మ‌ధ్య కాలంలో స్ప‌ష్టం చేసిన రాజ‌గోపాల్‌రెడ్డి.. మ‌ళ్లీ త‌న నాలుక‌ను మ‌డ‌తేశారు. ఇవ్వాల పార్టీకి రాజీనామా చేయడంతో అదికాస్త‌ స్ప‌ష్టం చేసిన‌ట్టు అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement