Sunday, April 14, 2024

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ కేసు నమోదు..

 

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్‌గా మారింది.  ఆయనపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.   హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేశారంటూ.. న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్‌పై 144/2021, సెక్షన్లు 153-ఏ, 295-ఏ, 298 r/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement