Saturday, May 11, 2024

Big Story: త్వరలో పెట్రోల్​, డీజిల్ ధరల పెంపు? ఎన్నిక‌లు అయిపోగానే బాదుడు..

గ‌త ఏడాది నవంబర్ నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశాలున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్​ విషయంపై అమెరికా, రష్యా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా క్రూడ్​ ఆయిల్ ధర ఏడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర (బ్రెంట్​) 95 డాలర్లకు చేరింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 2022 ప్రారంభంతో పోలిస్తే ముడి చమురు ధరలు ప్రస్తుతం 23శాతం వరకు పెరిగాయి. అయినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత పెంపు..
దేశీయంగా ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ధరలు పెంచితే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపొచ్చని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది పూర్తిగా చమురు మార్కెటింగ్ సంస్థలకు సంబంధించిన విషయమే. అయినప్పటికీ దేశంలో ప్రధాన కంపెనీలైన ఇండియన్ ఆయిల్​, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటివి ప్రభుత్వం రంగ సంస్థలుగా ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రస్తుతం ఎన్నికల పర్వం నడుస్తున్న కారణంగా.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయంగా పెట్రోల్​, డీజిల్​ ధరల్లో మాత్రం పెంపు లేకుండా కేంద్రం కట్టడి చేస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు ముగిసి వెంటనే పెట్రోల్​, డీజిల్ ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు..

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.45.. లీటర్ డీజిల్ ధర రూ.86.71గా కొనసాగుతోంది.
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18 , డీజిల్ ధర లీటర్​ రూ.94.61
విశాఖపట్నంలో పెట్రోల్​, డీజిల్ ధరలు (లీటర్​కు) రూ.109.03, రూ.95.17 గా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement