Friday, May 3, 2024

Big Breaking | వరల్డ్​ కప్​ మ్యాచ్​లో పాకిస్తాన్​ భారీ విజయం.. బ్యాటింగ్​లో ఆకట్టుకోలేకపోయిన నెదర్లాండ్స్​!

పాకిస్తాన్​తో జరుగుతున్న వరల్డ్​ కప్​ రెండో మ్యాచ్​లో నెదర్లాండ్స్ ఓటమి చెందింది. శుక్రవారం హైదరాబాద్​లోని ఉప్పల్​ స్డేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్​ జట్టును బౌలింగ్​ పరంగా బాగానే కట్టడి చేసినా.. బ్యాటింగ్​లో నెదర్లాండ్స్​ అనుకున్న మేరకు ఆడలేకపోయింది. దీంతో 286 టార్గెట్​ను ఛేదించే క్రమంలో కేవలం 205 పరుగులు మాత్రమే చేసి 41 ఓవర్లలోనే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసింది.

కాగా, ఈ మ్యాచ్​లో ఓపెనర్​ స్టార్ బ్యాటర్​ విక్రమ్​జిత్​ సింగ్​ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బాస్​ డీ లీడీ (67), ఎల్​వాన్​ బేక్​ (28) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక.. మిగతా బ్యాటర్లంతా సింగిల్​ డిజిట్​కే వికెట్లు పోగొట్టుకుని పెవిలియన్​ చేరారు. ఇందులో హరిస్​ రవూఫ్​ 2 వికెట్లు తీయగా.. షాహీన్​ ఆఫ్రిదీ, హసన్​ అలీ, ఇఫ్తీకర్​ అహ్మద్​, మహ్మద్​ నవాజ్​, షాబాద్​ ఖాన్​ తలా ఒక వికెట్​ పడగొట్టారు.​

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement