Wednesday, October 16, 2024

Exclusive | ముసలోడే కానీ మహానుభావుడు.. 70ఏండ్ల వయస్సులో మూడో పెళ్లి చేసుకున్న మాజీ రెజ్లర్!​

డబ్ల్యూడబ్ల్యూఈ తొలితరం రెజ్లర్లలో హల్క్ హోగాన్ ఎంతో ప్రముఖుడు. కండలు తిరిగిన దేహం, పొడవైన మీసాలు, తన ట్రేడ్ మార్క్ రెజ్లింగ్ విన్యాసాలతో హల్క్ హోగాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన యోగా ఇన్ స్ట్రక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు సడెన్​గా ఆయన వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఎందుకంటే 70 ఏండ్ల వయస్సులో తాను మళ్లీ పెళ్లి చేసుకోవడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇప్పుడు హల్క్ హోగాన్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే… ఆయన మూడో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా 70 ఏళ్ల వయసులో. స్కై డైలీ అనే అకౌంటెంట్ ను హల్క్ హోగాన్ తన జీవితంలోకి ఆహ్వానించాడు. హోగాన్ పెళ్లాడిన స్కై డైలీకి కూడా ఇదివరలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆమెకు కూడా ఇది మూడో వివాహం.

తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో సందడి చేస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో క్లియర్ వాటర్ ప్రాంతంలోని ఇండియన్ రాక్స్ బాప్టిస్ట్ చర్చిలో హల్క్ హోగాన్, స్కై డైలీల వివాహం జరిగింది. రూ.4 కోట్ల విలువ చేసే వజ్రపు ఉంగరాలను వారు పరస్పరం మార్చుకున్నారు. ఈ వివాహ వేడుకలో హోగాన్ బ్లాక్ సూట్ లో దర్శనమివ్వగా, స్కై డైలీ వైట్ వెడ్డింగ్ గౌన్ లో మెరిసిపోయింది. రెజ్లింగ్ వీరుడు హల్క్ హోగాన్ గతంలో లిండా, జెన్నిఫర్ మెక్ డేనియల్ అనే మహిళలను పెళ్లాడాడు. ఆయనకు ఇప్పటికే ఐదుగురు సంతానం ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement