Wednesday, May 1, 2024

పృథ్వీరాజ్ కి నో ట్యాక్స్ – ప్ర‌క‌టించిన యూపీ స‌ర్కార్

ఈ మ‌ధ్య‌కాలంలో చిత్రాలు బాగుంటే వాటికి ప‌లు రాష్ట్రాలు ట్యాక్స్ ని విర‌మించుకుంటున్నాయి. ఈ మ‌ధ్యే రిలీజ్ అయిన ది క‌శ్మీర్ ఫైల్ చిత్రానికి ట్యాక్స్ ఫ్రీగా చేశాయి ప‌లు రాష్ట్రాలు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘పృథ్వీరాజ్’ సినిమాకి యూపీ సర్కారు ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి స్పెషల్ షో వేసి చూపించారు. తాజాగా ఈ సినిమాను యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తన కేబినెట్ తో కలిసి రాజ్ భవన్ లో స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా చూశారు. అనంతరం సీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతీ ఒక్క సామాన్యుడు ఈ చిత్రం వీక్షించాలనే సదుద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపారు. చరిత్రను తెలిపే విధంగా సినిమా ఉందని కొనియాడారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్ ’ చిత్రం ప్రతీ ఒక్కరు చూడదగినదని అన్నారు. ఈ చిత్రంలో సోనూసూద్ కూడా ఒక ముఖ్య‌పాత్ర‌ని పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement