Friday, May 3, 2024

Breaking: ప్రాజెక్టుల సందర్శనకు అనుమతి లేదు.. భ‌ద్రాచ‌లంలో సీఎల్పీ బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు

ప‌ర్మిష‌న్ లేకుండా ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు వెళ్తున్న కాంగ్రెస్ క‌మిటీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా మొండికేసి రోడ్డుపై బైఠాయించ‌డంతో అరెస్టు చేశారు. సీఎల్పీ బృందాన్ని భూపాలపల్లికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో భద్రాచలం శివారులోని మణుగూరు క్రాస్ రోడ్ వద్ద రోడ్డుపై ఎమ్మెల్యేలు బైఠాయించారు. దీంతో ఖమ్మం- భద్రాచలం, ఖమ్మం- మణుగూరు రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసే క్ర‌మంలో పోలీసులు రాస్తారోకో చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను రోడ్డుపై నుంచి బలవంతంగా పక్కకు లాగేస్తుండ‌గా పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జ‌రిగింది.

ఇట్లాంటి ఉద్రిక్తతల పరిస్థితుల మధ్య పోలీసులు సీఎల్పీ బృందాన్ని అరెస్టు చేసి పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించారు. భద్రాచలంలో అరెస్టు చేసిన సీఎల్పీ బృందాన్ని పాల్వంచ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.. అక్కడి నుంచి నాటకీయ పరిణామాల మధ్య కొత్తగూడెం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్తామని నమ్మించి ఇల్లందు పోలీస్ స్టేషన్ వైపు త‌ర‌లిస్తున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement