Saturday, April 20, 2024

RRR అప్ డేట్: ‘నాటు నాటు’ సాంగ్ ప్రోమో

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన టిజర్స్ సినిమాపై అంచనాలు తారస్థాయిలో పెంచింది. తాజాగా “RRR” నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. “నాటు నాటు” అంటూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను పూర్తి స్థాయిలో ఈ నెల 10న విడుదల చేయనున్నారు.  ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు డ్యాన్స్ ఇరగదీసినట్లు పోస్టర్లు చూస్తే అర్థం అవుతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement