మన పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ చెట్లను చూస్తే అట్లాంటి ఫీలింగే వస్తోందన్నారు ఎంపీ సంతోష్‌కుమార్. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ చేపట్టిన ఓ బృహత్తర కార్యక్రమంపై పొగడ్తల వర్షం కురిపించారు. 40వేల మియావాకీ మొక్కలతో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా, 15 నెలల్లో 15 అడుగుల ఎత్తు పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నందుకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఎంపీ జోగినపల్లి సంతోష్ ధన్యవాదాలు తెలిపారు. ఇంతటి అద్భుతం సాధించినందుకు అభినందించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకొంతమంది ముందుకు వచ్చి వనాలను పెంచాలని పిలుపునిచ్చారు.
- Advertisement -


