Friday, April 26, 2024

ఆఫీసు వేళ‌ల్లో మొబైల్ వాడ‌రాదు – మ‌ద్రాసు హైకోర్టు కీల‌క తీర్పు

విధుల్లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో త‌మ వ్య‌క్తి గ‌త విష‌యాల కోసం మొబైల్ ఫోన్ వాడ‌రాద‌ని మ‌ద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. . మ‌ద్రాస్ హైకోర్టు జ‌స్టిస్ ఎస్ఎం సుబ్ర‌మ‌ణియం ఈ తీర్పును వెలువ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ దిశ‌గా నియ‌మావ‌ళిని రూపొందించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించారు. ఈ రూల్స్‌ను పాటించ‌ని ఉద్యోగుల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా హైకోర్టు త‌న ఆదేశాల్లో తెలియ‌జేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement