Monday, May 20, 2024

కొండగట్టు అంజన్న దర్శించుకున్న మంత్రులు

సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామిని తెలంగాణ మంత్రులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ఎమ్మెల్యేలు అంజన్న ఆలయానికి చేరుకోగా.. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు ఆంజనేయ స్వామి చిత్రపటంతో పాటు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, విద్యాసాగర్రావు, సంజయ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement