Friday, April 26, 2024

తండ్రి సంవ‌త్స‌రికం సంద‌ర్భంగా పూజ – ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తండ్రి సంవ‌త్స‌రికం సంద‌ర్భంగా ఆచారం ప్ర‌కారం పూజ‌లు చేశారు. ఆ ఫొటోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో చిరంజీవి పెద్ద త‌మ్ముడు నాగ‌బాబుతో క‌లిసి త‌న తండ్రి ఫొటో వ‌ద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న‌ట్టు క‌నిపించారు. త‌న తండ్రి సంవత్సరికం సందర్భంగా ఆయ‌న‌ను త‌లుచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నాన్న గారి సంవత్సరికం సందర్భంగా ఆయన స్మృతులని తలుచుకుంటూ, మాకు జన్మనిచ్చిన ఆ మహనీయుడు ఏ లోకంలో వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అని చిరంజీవి ట్వీట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వం

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement