Saturday, October 26, 2024

Blood Donation | రేపు మెగా ర‌క్త‌దాన శిబిరం.. టీఎస్‌ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌

తెలంగాణ వ్యాప్తంగా రేపు (మంగ‌ళ‌వారం) టీఎస్ ఆర్ట‌సీ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈమేర‌కు ఇవ్వాల (సోమ‌వారం) టీఎస్ ఆర్టీసీ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. తెలంగాణ‌లోని 101 డిపోల‌లో రేపు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మెగా ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించ‌నున్నారు. అందులో భాగంగా యాద‌గిరి గుట బ‌స్ స్టేష‌న్‌లో ర‌క్త‌దాన శిబిరం చేప‌ట్ట‌నున్న‌ట్ట డీపో మేనేజ‌ర్ శ్రీ‌నివాస్ తెలిపారు. ఉత్సాహ‌వంతులైన యువ‌తీ, యువ‌కులు శిబిరంలో పాల్గొని ర‌క్త‌దానం చేయాల‌ని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement