Friday, May 3, 2024

గ‌డ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు – ట్వీట్ చేసిన చంద్ర‌బాబు

టిడిపి పార్టీ మ‌హానాడు వేడుక‌ల్లో ఫుల్ బిజీగా ఉన్నారు చంద్ర‌బాబునాయుడు..ఇంత‌టి బిజీ షెడ్యూల్‌లోనూ ఆయ‌న బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గడ్క‌రీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు గ‌డ్క‌రీ జ‌న్మ‌దినాన్ని గుర్తు చేసుకున్న చంద్ర‌బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. గ‌తంలో తాను సీఎంగా ఉండ‌గా…ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన గ‌డ్క‌రీతో ఓ వేదిక మీద క‌లిసి కూర్చున్న ఫొటోను చంద్ర‌బాబు త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేసేందుకు గ‌డ్క‌రీకి మ‌రింత మేర అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement