Wednesday, October 9, 2024

Lightning strikes: పిడుగుపాటుకు .. ఏడుగురు మృతి

పిడుగులు పడి ఏడుగురు చనిపోయిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పిడుగులపాటు కారణంగా ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడ్డాయి.

వివిధ ప్రాంతాల్లో జరిగిన పిడుగుపాటు ఘటనల వల్ల ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బబ్లూ (30), వర్జిత్ యాదవ్ (32) ఇద్దరు రైతులు ఉషైత్ బజార్ నుంచి బైకుపై ఇంటికి తిరిగి వస్తుండగా.. భారీవర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. అదే ప్రాంతంలో అన్షిత(11) పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా పిడుగుపాటుతో మరణించింది. రాయ్‌బరేలీలోని దిహ్, భదోఖర్, మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గెండాలాల్ గ్రామ సమీపంలోని మోహిత్ పాల్ (14) పొలంలో పశువులను మేపుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్వ గ్రామంలో పొలంలో పని చేస్తుండగా జమున ప్రసాద్ (38) పిడుగుపాటుకు గురయ్యాడు. ఎటాహ్ లోని ఖంజర్ పూర్ గ్రామంలో దర్మేంద్ర(32) పశువులను మేపుతుండగా పిడుగుపాటుతో మరణించాడు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పుల పరిహారం ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement