Friday, May 3, 2024

అస్సలే ముంబై, అర్ధరాత్రి అకస్మాత్తుగా బైక్​ ఆగింది.. చుట్టూ ఎవరూ లేరు.. కానీ, ఇంతలో..

ఆపదలో ఉన్న వారిని చూసి దయచూపడం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది.. కానీ, దురదృష్టవశాత్తూ ప్రజలలో ఈ అరుదైన లక్షణం అంతరించిపోతోంది. అయితే.. ముంబైకి చెందిన ఓ మహిళ తనకు ఎదురైన ఓ ఇన్సిడెంట్​ని.. మానవత్వంపై తనకు కలిగిన నమ్మకాన్ని తెలియజేసింది. తమ బైక్‌లో పెట్రోల్ అయిపోవడంతో అర్ధరాత్రి రోడ్డుపై చిక్కుకుపోయామని, తన సోదరుడితోపాటు ఎటూ కదల్లేని పరిస్థితి తలెత్తిందని అక్షిత తెలిపింది. అయితే ఈ క్రమంలో వారికి ఓ ఫుడ్​ డెలివరీ ఎలా సహాయం చేశాడో సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. అక్షిత పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“ఆరోజు ఎందుకో మా పరిస్థితి దారుణంగా ఉంది.. ఇట్లాంటి సిచ్యుయేషన్​ ఏ ఒక్కరికీ రావొద్దని కోరుకుంటున్నా. అప్పుడు ఉష్ణోగ్రత 17 డిగ్రీలకు తగ్గిపోయింది. చలి విపరీతంగా ఉంది.. వాచ్​లో దాదాపు 12.15 గంటలు అవుతుంది అనుకుంటా. పెట్రోల్​ అయిపోయిన కారణంగా ఇంటికి వెళ్లే మార్గంలో నా బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. కనుచూపు మేరలో ప్రయాణికులు ఎవరూ లేరు. ఆ నిశ్శబ్ద రాత్రి ఓ ఫుడ్​ డెలివరీ బోయ్​ తన మొబైల్ ఫోన్‌లో అడ్రస్ కోసం చెక్​ చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని కనుగొన్న మేము.. అతడి నుంచి ఏదైనా హెల్ప్​ దొరుకుతుందా అని రోడ్డు పక్కన వెయిట్​ చేస్తున్నాం. అతనితో మాట్లాడేందుకు కోసం నా సోదరుడు దగ్గరికి వెళ్లాడు. విషయం చెప్పి మా బైక్‌ని తన బైక్​తో అటాచ్​ చేసి ముందుకు తీసుకెళ్లే ప్లాన్​ గురించి ఆలోచించాం. అయితే ముందు దానికి అతను నిరాకరించాడు. ‘‘సార్ నేను వేరే మార్గంలో వెళ్లాలి.. ఫుడ్​ డెలివరీకి ఆలస్యం అయివుతుంది.. అలా నేను చేయలేను” అని అతను తెలిపాడు.

ఆ తర్వాత మమ్మల్ని వాటర్ బాటిల్ అడిగాడు. కానీ, దురదృష్టవశాత్తూ మా దగ్గర ఏమీ లేదు. దీంతో తన డెలివరీ బ్యాగ్ తీసి తన సొంత వాటర్ బాటిల్ ఖాళీ చేసి.. మోకాళ్లపై నిలబడి తన బైక్ నుండి పెట్రోల్ తీయడం ప్రారంభించాడు. అది చూసి మాకు కొండంత ధైర్యం వచ్చింది. ఆ పెట్రోల్​తో సమీపంలోని పెట్రోల్ బంక్​ దాకా చేరుకోవడానికి చాన్స్​ దొరుకుతుంది. అతని ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. మాకు అతను మారువేషంలో ఉన్న దేవదూతలా కనిపించాడు. ఫుడ్​ డెలివరీ చేసే టైమ్​లో మాకు కనిపించిన అదృష్టంగా భావించాం. అతని దయ వల్ల ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డాం. అయితే ఈ ఫుడ్​ డెలివరీ హీరోలు చిరునవ్వులు చిందిస్తున్న వారి గురించి నేను చాలా చదివాను. కానీ, నేను ప్రత్యక్షంగా చూసే అదృష్టం వచ్చింది” అని అక్షిత తన పోస్టులో చెప్పుకొచ్చింది. తను పెట్టిన పోస్టుకు ఫుడ్​ డెలివరీ బోయ్​కు కామెంట్స్​ ద్వారా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Swiggy delivery boy gives petrol from his own bike to strangers stranded at  night. Viral post

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement