Saturday, July 27, 2024

న‌న్ను చంపొద్దు – లొంగిపోతా – ప్ల‌కార్డు మెడ‌లో వేసుకున్న రౌడీ

న‌న్నుచంపొద్దు ..లొంగిపోతాన‌ని ప్ల‌కార్డు మెడ‌లో వేసుకుని పోలీసుల‌కు లొంగిపోయాడో రౌడీ. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఛాపియా పోలీస్ స్టేష‌న్ లో చోటు చేసుకుంది. కిడ్నాపుల కేసుల్లో నిందితుడు, తలపై రూ.25 వేల రివార్డు ఉన్న గౌతమ్ సింగ్ అనే గూండా ఈ ప‌నిని చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 7న ఒక చికెన్ వ్యాపారిని గౌతమ్ సింగ్ కిడ్నాప్ చేశాడని, రూ.20 లక్షలివ్వాలంటూ అతడి కుటుంబానికి ఫోన్ చేసి డిమాండ్ చేశాడని గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా చెప్పారు. అతడికి సహకరించిన జుబైర్, రాజ్ కుమార్ యాదవ్ లను అరెస్ట్ చేశామని, గౌతమ్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టి రూ.25 వేల నజరానా ప్రకటించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో తన సోదరుడు అనిల్ తో కలిసి గౌతమ్ లొంగిపోయాడని సంతోష్ మిశ్రా తెలిపారు. కాగా పోలీసులు ఎక్కడ ఎన్ కౌంటర్ చేసి చంపేస్తారోనని ఉత్తరప్రదేశ్ లోని నేరస్థులు, గూండాలు గజగజ వణికిపోతున్నారిప్పుడు. ఆ భయంతోనే పోలీసులకు లొంగిపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement