Tuesday, October 8, 2024

Factory Failure | వందేభారత్‌ తయారీకి బిగ్​ టార్గెట్​.. కపుర్తలా కోచ్‌ ఫ్యాక్టరీ విఫలం

పంజాబ్‌లోని జలంధర్‌ సమీపంలో ఉన్న కపుర్తలా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ 2022-23లో ఒక్క వందేభారత్‌ రైలును కూడా తయారు చేయలేకపోయింది. ఈ కోచ్‌ ఫ్యాక్టరీకి 32 వందే భారత్‌ రైళ్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని విధించింది. సప్లయర్స్‌ ట్రైన్‌కు కావాల్సిన ఎలక్ట్రికల్‌ కంపోనెట్స్‌ను సరఫరా చేయలేకపోవడం వ్లలే ఒక్క వందేభారత్‌ రైలును కూడా తయారు చేయలేకపోయినట్లు కపుర్తలా కోచ్‌ ఫ్యాక్టరీ తెలిపింది.

2024 ఆగస్టు నాటికి దేశంలో 75 వందేభారత్‌ రైళ్లను నడిపించాలన్న రైల్వేల లక్ష్యం దీని వల్ల నెరవేరే అవకాశం లేదని రైల్వే అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. వందేభారత్‌ రైళ్లతో పాటు, ఇతర రైళ్ల కోచ్‌లను తయారు చేయడంలోనూ ఈ ఫ్యాక్టరీ విఫలమైంది. 2022-23లో కపర్తలా కోచ్‌ ఫ్యాక్టరీలో 1,885 కోచ్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1,478కోచ్‌లను మాత్రమే తయారు చేయకలిగింది. ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో 256 3హెచ్‌పీ మీమూ ట్రైన్స్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 2023 మార్చి నాటికి కేవలం 153 ట్రైన్స్‌ను మాత్రమే తయారు చేయకలిగింది. 2024 సెప్టెంబర్‌ నుంచి కపుర్తలా కోచ్‌ ఫ్యాక్టరీలో వందేభారత్‌ రైళ్లు పూర్తిస్థాయిలో తయారవుతాయని ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.

ఈ సంవత్సరం రైల్వే బోర్డు ఆర్‌సీఎఫ్‌ కపుర్తలాకు 64 వందేభారత్‌ రైళ్లను తయారు చేయాలని టార్గెట్‌ పెట్టింది. ఫ్రెంచ్‌ మల్టినేషన్‌ రోలింగ్‌ స్టాక్‌ కంపెనీ అల్‌స్టామ్‌ పంపించిన వందేభారత్‌ ట్రైన్‌ డిజైన్‌ను ఆర్‌సీఎఫ్‌ ఇంకా ఆమోదించలేదని రైల్వే సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు 92 డిజైన్స్‌లో కేవలం 4 మాత్రమే ఆమోదించారు. ఆ ఆర్ధిక సంవత్సరంలోనే సెమి హైస్పీడ్‌ రైళ్లను తయారు చేయడం ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement