Wednesday, May 15, 2024

Hyderabad: జూబ్లీహిల్స్​ గ్యాంగ్​రేప్​ కేసు.. ప్రధాన నిందితుడు సాదుద్దీన్​ మాలిక్​కు బెయిల్​ మంజూరు

హైదరాబాద్​ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్‌కు నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులోని పోక్సో కేసుల ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు మాలిక్ బుధవారం చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆరుగురు నిందితుల్లో మే 28న జూబ్లీహిల్స్ ప్రాంతంలో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో సదుద్దీన్ మాలిక్ మాత్రమే మేజర్ మరియు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

జులై చివరి వారంలో జువైనల్ జస్టిస్ బోర్డు, హైకోర్టు బాలుర కోసం ప్రత్యేక అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచిన ఐదుగురు మైనర్ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 8 న హైదరాబాద్ పోలీసులు AIMIM ఎమ్మెల్యే మైనర్ కొడుకుతో సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అప్పటి నుండి వారు జువైనల్ జైలులో ఉన్నారు. కాగా, ప్రధాన నిందితుడు సాదుదీన్ మాలిక్​ని మాత్రం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇక.. మాలిక్ తరపు డిఫెన్స్ లాయర్ వాదిస్తూ చాలా వరకు దర్యాప్తు పూర్తయి, సంబంధిత కోర్టుల ముందు చార్జ్ షీట్ దాఖలు చేసినందున నిందితుడికి బెయిల్ ఇవ్వొచ్చన్నారు. దీంతో వాదనలు విన్న కోర్టు ఇవ్వాల బెయిల్ మంజూరు చేసి నిందితులకు కొన్ని షరతులు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement