Thursday, April 25, 2024

RRR: ఎన్టీఆర్ సూపర్ హాట్ కేక్.. బాలీవుడ్ లో ఆరు బిగ్ ఆఫర్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కెంచిన RRR కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ దేశవ్యాప్తంగా  విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనపై అందరూ మాట్లాడుతున్నారు. పాన్ ఇండియాన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని హీరోలకు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సినిమా విడుదల సందర్భంగా.. RRR మైండ్ బ్లోయింగ్ అని, ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పవర్‌ప్యాక్డ్ పర్‌ఫార్‌మెన్స్ కనబర్చారని అన్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటన ఫైర్ అంటూ ప్రశంసలు గుప్పించారు. అంతేకాదు ఇది ఎన్టీఆర్‌కి గేమ్ ఛేంజర్ సినిమా అవుతుందని, ఆయనకు నేషనల్ అవార్డు పక్కా అని పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని పొగిడేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

RRR సినిమాతో బాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతం పెరిగిందని ఉమైర్ సంధు పేర్కొన్నారు. ఎన్టీఆర్ సూపర్ హాట్ కేక్ అయ్యారని తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనా ప్రతిభ చూసి బీ టౌన్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఆయన డేట్స్ కోసం క్యూ కట్టాయని, ప్రస్తుతం ఆయనకు 6 బిగ్గెస్ట్ సినిమాల ఆఫర్స్ వచ్చాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement