Friday, May 3, 2024

జానా వ్యాఖ్యాల‌పై తెలంగాణ కాంగ్రెస్ లో సెగ‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి చేసిన ‘ పొత్తు ‘ వ్యాఖ్యలు ఆ పార్టీలో ఇప్పుడు కలకలం రేగుతు న్నాయి. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ప్రధాన అస్త్రంగా మల్చుకోవడంతో .. కాంగ్రెస్‌ పార్టీ ఇరాకటం లో పడుతోంది. తద్వారా కాంగ్రెస్‌ పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే అభిప్రాయం గాంధీభవన్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ తో ఢీ అంటే ఢీ అనే విధంగా బలమైన పోరాటం చేస్తుంటే.. సీనియర్‌ నేతగా ఉన్న ఆయన.. పొత్తుల అంశం మాట్లాడటమేంటనే ప్రశ్నలు సొంత పార్టీలోనే ఉత్పన్నమవుతున్నాయి. జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొందరు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జానారెడ్డి సీనియర్‌ నాయకుడు కావడంతో.. అధిష్టానం కూడా వెంటనే స్పందించకుండా ఆచితూచి వ్యవహారిస్తోందని చెబుతున్నారు. అయినప్పటికి పార్టీ పెద్దల జోక్యంతోనే ఆయన వివరణ ఇచ్చారని జానారెడ్డి వర్గీయలు చెబుతున్నా రు.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే వెళ్లుతుందని, బీఆర్‌ఎస్‌తో పొత్తు అనే అంశం ఉత్పన్నమే కానది గట్టిగానే చెప్పారు. అయినప్పటికి రాష్ట్రానికి చెందిన కొందరు సీనియర్లు పదే పదే పొత్తు అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గతం లోనూ ముందు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ముందు.. పేద ప్రజల కోసం నగరంలో ప్రభుత్వం నిర్వహి స్తున్న రూ. 5 మధ్యాహ్నా భోజనం సీఎల్పీకి తెప్పించుకుని తిన్నారు. ఆ భోజం బాగుందని కితాబివ్వ డంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ ఎన్నికల్లో ఒక అవకాశంగా మల్చుకుని ముందుకు వెళ్లిందని, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఇప్పుడు కూడా అసెంబ్లిd ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమమయం ఉన్నది. రాష్ట్రంలో ఎవరు ఎటు వైపు ఉంటారు..? అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీనా..? బీజేపీనా..? అని ప్రజల్లో బలంగా చర్చ జరుగుతున్న సమయంలోనే సీనియర్‌ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్ర దుమారానికి దారితీసింది. కేసీఆర్‌ ప్రభు త్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్‌ చేసుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు పోటీ పడుతున్నా యి. ఇప్పుడు కాంగ్రెస్‌, బీఆర్‌స్‌ మధ్య పొత్తు ఉంటుందనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైతులకు ఉచిత కరెంట్‌పై అసెంబ్లిdలో చర్చ జరుగుతుండగా.. సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వం ఉచితంగా కరెంట్‌ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్ప డం అప్పట్లోనే రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చగా మారింది. ఇదే పొత్తుల అంశంపై భువగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడినప్పుడు.. ఆయనపై ఒంటికాలుపై లేచిన ఆ జిల్లాకు చెందిన కొందరు నాయకులు.. జానారెడ్డి విషయం వచ్చేసరికి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement