Monday, May 20, 2024

ఇంత‌టి దారుణ‌మా-భార‌తీయ సిక్కు కుటుంబాన్ని హ‌త‌మార్చిన దుండ‌గులు-ప‌సికందుని వ‌ద‌ల్లేదు

మూడు రోజుల క్రితం భార‌తీయ సిక్కు కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని దుండ‌గులు. కాగా క్యాలిఫోర్నియాలో అపహరణకు గురైన నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం, 8 నెలల పసి బాలుడి సహా హత్యకు గురైంది. క్యాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు. ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు.. 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు. వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. మూడు రోజుల క్రితం వీరంతా అపహరణకు గురవడం తెలిసిందే. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యాలకు పాల్పడి ఉండొచ్చని వార్న్ కే ప్రకటించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. సీరియస్ గా ఉండడంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement