Monday, April 29, 2024

WTC Final: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్ జట్టు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC) 2023కు సమయం ఆసన్నమైంది. భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే బలమైన ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టెందుకు ఇండియా టీం సిద్ధమైంది. MS ధోని నేతృత్వంలో చివరిసారిగా 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ దాదాపు 10 సంవత్సరాల విరామం తర్వాత వారి మొదటి ICC ట్రోఫీని గెల్చుకునేందుకు పోటీపడుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా టీం మొదటిసారిగా WTC ఫైనల్‌ను ఆడుతోంది. గతంలో ODI ప్రపంచ కప్, T20 వరల్డ్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న ఈ జట్టు ఈ WTC టైటిల్‌ను గెల్చుకోవాలని ఆశిస్తోంది. ఇంకోవైపు భారత్ వరుసగా రెండో WTC ఫైనల్‌ను ఆడుతోంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement