Friday, May 17, 2024

India Corona: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్త ఎన్ని కేసులంటే..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1685 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,16,372కు చేంరింది. ఇందులో 4,24,78,087 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో  83 మంది మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 5,16,755కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,530 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2499 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా ఉందని చెప్పింది.  దేశవ్యాప్తంగా 1,82,55,75,126 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement