Tuesday, April 23, 2024

హోంగార్డుని ప్ర‌శంసించిన – తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి స‌తీశ్ చంద్ర శ‌ర్మ ఓ హోంగార్డుని నిత్యం గ‌మ‌నిస్తున్నారు. ఆ హోం గార్డు విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావంతో ప‌ని చేస్తున్నందుకు ఆయ‌న‌ను ఓ రోజు అభినందించాల‌ని భావించారు స‌తీశ్ చంద్ర‌శ‌ర్మ‌. రోజులాగే త‌న అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ మీదుగా వెళ్తూ రోడ్డు ప‌క్క‌న కారు ఆపి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ విగ్ర‌హం వ‌ద్ద ట్రాఫిక్ విధులు నిర్వ‌హిస్తోన్న‌ హోంగార్డ్ అష్ర‌ఫ్ అలీని అభినందించారు. అష్ర‌ఫ్ అలీకి పుష్ప‌గుచ్చం అందించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి త‌న‌ను అభినందించ‌డంతో అలీ ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement