Saturday, April 27, 2024

కేరళలో భారీ వర్షాలు, ఆరెంజ్​ అలర్ట్​ ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాల రాక

కేరళలో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ)  బుధవారం కేరళలోని ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్ మరియు కాసర్‌గోడ్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.అయితే రేపు (గురువారం) కన్నూర్, కాసర్‌గోడ్‌లలో భారీ వర్షాలుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇవ్వాల కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా ఉంది.

కేరళ, చుట్టుపక్కల ప్రాంతాలలో తుఫాను ప్రభావం ఉంటుందని, ఉత్తర కేరళ నుండి విదర్భ వరకు అల్పపీడన ద్రోణి కారణంగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడమే కాకుండా బలమైన గాలులు వీస్తాయని అధికారులు ప్రటకించారు. ​కాగా, ఇప్పటికేకేరళలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సాధారణ జనజీవనం స్తంభించింది.

రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆ తర్వాత 2 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు ప్రజలు నదులు, ఇతర నీటి వనరులకు దూరంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డిఎంఎ) కోరింది. ఈ నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఎదుర్కోవాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఇప్పటికే ఐదు బృందాలను కేరళకు రప్పించింది.

ఆరెంజ్ అలర్ట్ అంటే ఏమిటి

రెడ్ అలర్ట్ అంటే 24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.ఆరెంజ్ అలర్ట్ అంటే 6 సెం.మీ నుండి 20 సెం.మీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఎల్లో అలర్ట్​ అంటే 6 నుండి 11 సెం.మీ మధ్య భారీ వర్షపాతం ఉంటుందని హెచ్చరిక జారీ చేయడం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement