Saturday, May 18, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. దేశీయంగా బంగారం.. వెండి ధ‌ర‌లు పుంజుకున్నాయి. హైద‌రాబాద్ లో 10గ్రాముల బంగారం 22క్యారెట్లు రూ.600మేర పెరిగింది.దాంతో రూ.54,800 మార్కుకు చేరింది. మరోసారి ఆల్ టైం హైకి చేరువలోకి వచ్చింది. క్రితం రోజు రూ.800 పడిపోవడం తెలిసిందే. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు హైదరాబాద్‌లో ఒక్కరోజే రూ.650 మేర పెరిగి రూ.59,780కి చేరింది. 4 రోజుల కిందట బంగారం ధర 10 గ్రాములకు రూ.60 వేల 320 మార్కును తాకింది. దేశ రాజధాని దిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగిపోయింది. అక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.600 పెరిగి 10 గ్రాములకు రూ.54,950 వద్ద ఉండగా.. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.650 మేర పుంజుకొని రూ.59,930 వద్దకు చేరింది.మరోవైపు సిల్వర్ రేట్లు కూడా మరోసారి భారీగానే పెరిగాయి. హైదరాబాద్‌లో పెద్ద షాక్ ఇస్తూ వెండి ధర ఒకేరోజు కిలోపై రూ.1400 పెరిగి రూ.75,400 మార్కును చేరింది. దిల్లీలో కూడా భారీగానే రూ.1000 మేర పెరిగి ప్రస్తుతం కిలోకు రూ.72,600ను తాకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement