Tuesday, May 7, 2024

మ‌ళ్లీ స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. ఇవ్వాల రేట్ ఎంత ఉందంటే..

బంగారం ధర తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 150 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 430 రూపాయలుంది. కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47, 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 51, 430 రూపాయలుంది.

ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 370 రూపాయలకు చేరుకుంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 760 రూపాయలుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47, 150 రూపాయలు కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51, 430 రూపాయలుంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47, 150 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 51, 439 రూపాయలుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement