Friday, May 3, 2024

Gold Rate: భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఇవీ..

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. నిన్న పెరిగిన పసిడి రేటు నేడు పడిపోయింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 మేర తగ్గింది. దీంతో బంగారం ధర రూ. 52,470కు దిగొచ్చింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ. 48,100కు చేరింది. బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు రూ.500 పడిపోయింది. దీంతో కేజీ వెండి దర రూ. 74,200కు తగ్గింది. బంగారం, వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement