Friday, May 3, 2024

మేక‌పాలు పితికిన పంజాబ్ సీఎం.. వైర‌ల్ అవుతున్న వీడియో

పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జీత్ సింగ్ చ‌న్నీ ఓ రోజు టూర్ వెళ్తున్నారు. అయితే దారిలో మేక‌ల మంద క‌నిపించింది. త‌న వాట‌ర్ బాటిల్ కూడా ఖాళీగా ఉంది. దీంతో క‌న్వాయ్‌ని ఆపేశారు. మేక‌ల కాప‌రి ద‌గ్గ‌ర‌కెళ్లి ఓ మేక నుంచి పాలు త‌న బాటిల్‌లో పితికారు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.. కాగా ఈ మ‌ధ్య‌నే పంజాబ్ ఎన్నిక‌లు ముగిశాయి. 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగగా.. మార్చి 10న రిజ‌ల్ట్ కూడా రానుంది. కాగా, ఈ వీడియో చూసిన చాలా మంది సీఎం అంటే ఇంత సింపుల్​గా ఉండాలి అంటూ కామెంట్స్​ చేస్తుంటూ.. ఇంకొందరేమో అధికారంలోకి రాకుంటే పాలు పితుక్కోవడమే అంటూ నెగిటివ్​ కామెంట్స్​ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement