Wednesday, February 21, 2024

WGL: కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే క్రేన్ కు వేలాడ‌దీస్తా.. కొండా ముర‌ళీ

వరంగల్ – మాజీ ఎమ్మెల్సీ , కాంగ్రెస్ నేత కొండా మురళి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తన కార్యకర్తల జోలికి వస్తే క్రేన్ కు కట్టేసి ఉరి తీస్తానని కొండా మురళి ప్రత్యర్ధులకు వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో కొండా మురళి కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ స్థానం నుండి కొండా సురేఖ పోటీ చేస్తారన్నారు. తన కార్యకర్తల జోలికి వస్తే పోలీసులకు చెప్పి మరీ క్రేన్ కు కట్టేసి ఉరి తీస్తానని కొండా మురళి హెచ్చరించారు.

కొందరు కొండా మురళి పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారన్నారు. తన కార్యకర్తల జోలికి వస్తే పాత కొండా మురళిని చూస్తారని ఆయన తేల్చి చెప్పారు. తనకు పోలీస్ స్టేషన్లు కొత్త కావన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి ఎర్రబెల్లి స్వర్ణ నిన్న ప్రమాణం చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ గొడవ జరిగిందని కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వర్ రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement