Wednesday, May 15, 2024

Exclusive – మ‌ణిపూర్ ‘కుట్ర’ కోణాలు …

న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి
కుకి జాతికి చెందిన మహిళల్ని వివస్త్రల్ని చేసి అమానుషంగా జరిపిన బహిరంగ ప్రదర్శ నతో ఒక్కసారిగా మణిపూర్‌ అంతర్జాతీ యంగా వార్తల్లోకెక్కింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సంఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. లౌకిక వాద పార్టీలన్నీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా యి. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం భారత్‌లో అణగదొక్కబడిన జాతులపై దాడులు జరుగుతున్నాయంటూ కథనాలు వెలువరిస్తున్నాయి. కొన్ని దేశాలైతే ఈ సంఘటనకు సంబంధించి తమ వ్యతిరే కతను బహిర్గత పర్చాయి. ఇది ఖచ్చితంగా రెండు జాతుల మధ్య సమస్యే. దీనికి ప్రధాన కారణం మణిపూర్‌లో మెజార్టీగా ఉన్న మైతేయ తెగ వారికి గిరిజన హోదా కల్పించే అంశాన్ని పరిశీలించమంటూ ఆ రాష్ట్ర న్యాయస్థానం సూచించడం. అక్కడ్నుంచి ఈ వివాదం రాజుకుంది. ఇరువర్గాల మధ్య దాడులు జరిగాయి. ఓ వైపు మైతేయ, మరో వైపు ఇప్పటికే గిరిజన హోదా అనుభవిస్తున్న కుకీలు, నాగాలు ఇరువర్గాల హోరాహోరీ ఇప్పుడా రాష్ట్రాన్ని భస్మీపటలం చేస్తోంది. ఇందులో కేంద్రం తగిన విధంగా స్పందించలేదన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి మైతేయ తెగకు చెందిన వ్యక్తి కావడంతో ఓ వర్గానికి కేంద్రం సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కొందరు విమర్శిస్తున్నారు.

అయితే వాస్తవానికి ఈ తెగల మధ్య వివాదం ఈ నాటిదికాదు. అలాగే మైతేయలు గిరిజన హోదా కోసం డిమాండ్‌ చేయడం కూడా ఇప్పటిదికాదు. ఇందుకు సుదీర్ఘ చారిత్రక నేపధ్యముంది. మణిపూర్‌ ప్రధానంగా లోయ, కొండ ప్రాంతంగా విభజించబడింది. లోయ ప్రాంతం మొత్తం రాష్ట్రంలో పదిశాతం మాత్రమే. మిగిలిన విస్తీర్ణమంతా కొండ ప్రాంతమే. లోయ ప్రాంతంలో హిందువులైన మైతేయలుంటున్నాయి. కొండ ప్రాంతాల్లో ఆదివాసీలైన కుకీలు, నాగాలుంటున్నారు. వీరెవరి మధ్య వ్యక్తిగత విరోధాలు, వైషమ్యాలుండేవికాదు. జాతులు వేరైనా ఒకప్పుడి ఇద్దరి మధ్య పెళ్ళిళ్ళు కూడా జరిగేవి. కానీ ఈ ప్రాంతంలో మొదలైన మతమార్పిడిలు, ఆ తర్వాతొచ్చిన ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు జాతుల మధ్య వైరాన్ని రాజేశాయి. మొత్తం జనాభాలో ఆదివాసీలైన కుకీలు, నాగాలు 41శాతం ఉన్నారు. మైతేయలు 53శాతమున్నారు. మిగిలిన కొన్ని తెగలు కూడా ఇక్కడ జీవిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు ఆదివాసీలకు అపరిమిత హక్కులిచ్చాయి.

కొండ ప్రాంతాల్లో ఆదివాసీలు మాత్రమే జీవించాలి. అక్కడ భూములు, స్థలాల్ని కొనుగోలు చేసే హక్కు ఆదివాసీలకు మాత్రమే ఉంది. మొత్తం రాష్ట్రంలో 53శాతం ఉన్న మైతేయలు విస్తీర్ణంలో 10శాతం మాత్రమే ఉన్న ఇంఫాల్‌ లోయ భూభాగానికే పరిమితం కావాలి. రాన్రాను మైతేయల సంఖ్య కూడా పెరుగుతోంది. కుటుం బాలు విడివడుతున్నాయి. కొత్తగా భవనాల నిర్మాణం అవసరమైంది. ఇందుకు స్థలం కావాలి. పక్కనే ఉన్న కొండ ప్రాంతాల్లో అనువైన చోట వీరు ఇళ ్ళ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో తమక్కూడా గిరిజన హోదా కావాలంటూ మైతేయలు ఉద్యమానికిశ్రీకారం చుట్టారు. పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా మరింత భూభాగం తమక్కావాలంటూ వీరు పట్టుబట్టారు. వీరికి గిరిజన హోదా లభిస్తే కొండ ప్రాంతాల్లోకి మైతేయలు కూడా చొచ్చుకొస్తారన్న భయం నాగాలు, కుకీల్లో ఏర్పడింది. అప్పట్నుంచి పరస్పర ఘర్షణలు మొదలయ్యాయి. హైకోర్టు సూచనతో ఇవి మరింత ఉదృతరూపం దాల్చాయి.

ఇదొక్కటే కాదు.. ఈ రాష్ట్రంలో మతమార్పిడిలు కూడా దీర్ఘకాలంగా ఓ ప్రధన సమస్యగా మారాయి. 19వ శతాబ్ధంలోనే ఇక్కడకు క్రైస్తవ మిషనరీలు ప్రవేశించాయి. 1894లో ఇంగ్లాండ్‌కు చెందిన విలియమ్‌ పెట్టిగ్రూ అనే క్రైస్తవ మిషనరీ మణిపూర్‌కొచ్చారు. ఆయన అర్ధింజన్‌ అబారీజీన్స్‌ మిషనరీ గ్రూప్‌నకు చెందినవారు. అంతవరకు ఈ ప్రాంతంలో అమెరికన్‌ బాపిస్ట్‌ ఫారిన్‌ మిషన్‌ సొసైటీ మాత్రమే చిన్న చర్చి నిర్వహించేది. కానీ పెట్టిగ్రూ బాప్టిజం విస్తరణకు నడుంకట్టారు. ఆయన తొలుత మైతేయ తెగపై దృష్టిపెట్టారు. అయితే మైతేయలెవరూ మతమార్పిడికి పెద్దగా ముందుకు రాలేదు. వారు హిందువులుగా కొనసాగేందుకు నిర్ణయించారు. దీంతో కొండ ప్రాంతాలకు తరలెళ్ళాడు. అక్కడ పాఠశాలలు, ఆసుపత్రుల్ని ప్రారంభించారు. బైబిల్‌ను స్థానిక భాష తంగకుల్‌ లోకి అనువాదం చేశాడు. ఉచితంగా పంపిణీ చేశాడు. సేవ, విద్య అంటూ ఆదివాసీల్ని ఆకట్టుకున్నాడు. కుకీలు ఆయన్ను పూర్తిగా విశ్వసించారు. దీంతో పెట్టిగ్రూ మరికొంతమంది క్రైస్తవ మిషనరీల్ని అక్కడకు రప్పించారు. వాటికన్‌కు చెందిన రాబర్డ్‌, యుఎమ్‌ఫాక్స్‌, డాక్టర్‌ జిజి క్రోజియల్‌, తదితరులు ఈ కొండ ప్రాంతాల్లోని కుకి గిరిజనులపై మతమార్పిడి వల విసిరారు. ముందుగా ఆదివాసీల జీవన విధానం, ఆరాధనా పద్దతులు, వస్త్రధారణ వంటివన్నీ అనాగరికమైనవని బోదించారు. సృష్టికర్త ఒక్కడేనన్నారు. హిందూమతంలో బహు దేవతలపై విమర్శలు గుప్పించారు. హిందూమతంపై ఆదివాసీల్లో అపోహలు, అనుమానాలు కల్పించారు. అప్పట్నుంచి కుకిలు ఒక్కొక్కరుగా బాప్టిజం బాటపట్టారు. అయితే ఆశించిన స్థాయిలో మతమార్పిడిలు ముందుకు సాగలేదు. కానీ 1911లో వీరంతా దేశాన్నొదిలి వెళ్తూ తాము నాటిన విత్తనాలు భవిష్యత్‌లో ఫలాలిస్తాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మణిపూర్‌లో మంటల్ని రాజేస్తున్నాయి.

మణిపూర్‌లోని ఆదివాసీలన ు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు నెహ్రూ-ఎర్విన్‌ పాలసీ సహకరించింది. ఇక్కడి ప్రజల జీవన స్థితిగతుల్ని అధ్యయనం చేసేందుకు స్వతంత్య్రానంతర భారత ప్రభుత్వాలు మిషనరీల్ని అనుమతించాయి. 1951లో మణిపూర్‌లో క్రై స్తవుల సంఖ్య 12శాతం. ఇది 1961కి 21శాతానికి పెరిగింది. అప్పటికి కొందరు కుకిలు మయన్మార్‌లో ఉన్నారు. వీరు కూడా ఇక్కడి ఆకర్షనీయ పరిస్థితులకు తిరిగి మణిపూర్‌ వచ్చారు. క్రైస్తవ మతం తీసుకున్న ఆదివాసీలకు కూడా మణిపూర్‌ ప్రభుత్వం ఎస్‌టి హోదా కల్పించింది. అక్కడున్న హిందువులకు ఒబిసి హోదా మాత్రమే పరిమితమైంది. పైగా మొత్తం భూభాగంలోని 90శాతం ఉన్న కొండల్లో ఈ ఎస్‌టి హోదాగల ఆదివాసీలకు మాత్రమే నివాసం, క్రయవిక్రయ హక్కుల్ని ప్రభుత్వం జారీ చేసింది.
ప్రస్తుత మణిపూర్‌ దమనకాండపై దేశవ్యాప్తంగా ఉన్న చర్చిలన్నీ గళమిప్పాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు చర్చిలు ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీన్ని శాంతిభద్రతల సమస్యగా కాకుండా మతాల మధ్య చిచ్చుగా అభివర్ణించేందుకు కొన్ని వర్గాలు గట్టిప్రయత్నాలకు పాల్పడుతున్నాయి.

- Advertisement -

మణిపూర్‌కు గొప్ప చరిత్ర ఉంది . నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ భారత జెండాను తొలిసారిగా ఎగురవేసిన ప్రాంతం మణిపూర్‌. బ్రిటీష్‌ నుండి ఈ ప్రాంతాన్ని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ విముక్తి చేసింది. అయితే ఇది తాత్కాలికమే. అయితే 1947కి ముందే ఈ ప్రాంతం బ్రిటీష్‌ నుండి కొంతకాలం స్వతంత్య్రాన్ని పొందింది. అలాగే పోలో క్రీడ కూడా ఇక్కడే పుట్టింది. బ్రిటీష్‌ పాలకులు ఈ ఆటను ఇంగ్లాండ్‌ తీసుకెళ్ళి మరిన్ని మెరుగులు దిద్దారు. అనంతరం ఈ ఆట ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. పండిట్‌ నెహ్రూ తొలిసారి ఈ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు దీన్ని భారత దేశ ఆభరణంగా అభివర్ణించారు. చారిత్రక పురాణకాలంలో కూడా మణిపూర్‌ ప్రస్తావనుంది. ఇక్కడ మణులు విరివిగా లభించేవి. ఈకారణంగానే దీనికి మణులపురంగా పేరొచ్చింది. అర్జునుడు భార్యల్లో ఒకరైన చిత్రాంగద పుట్టినిల్లు మణిపూరే. వారి కుమారుడు బబ్రువాహనుడు మణిపూర్‌ను చాలాకాలం పరిపాలించాడు. వైష్ణవ పరంపరకు చెందిన వేలాదిమంది హిందువులు ఇక్కడ జీవించేవారు.

ఈ వివాదానికి పరిశీలకులు మరో కారణాన్ని కూడా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం కుకీలు, నాగాలు నివసిస్తున్న కొండ ప్రాంతాల్లో అపార బొగ్గు నిల్వలున్నాయి. ఇటీవల పెట్రోలియం నిక్షేపాలు కూడా బయటపడ్డాయి. సుమారు 139కిలోమీటర్లరైల్వేలైన్‌ను ఈ కొండ ప్రాంతాల మీదుగా భారత ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతర్యుద్దం పేరిట గిరిజనుల్నిఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించే కుట్రలు జరుగుతున్నాయన్న విమర్శలకు కూడా కొన్ని వర్గాలు పాల్పడుతున్నాయి. అత్యంత విలువైన ప్రకృతి సంపదలను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆరోపణలున్నాయి. కాగా ఈ కొండ ప్రాంతాల్లో గసగసాలు పంట విస్తారంగా ఉంది. గసగసాల్ని మాదకద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు. ఇటీవల పోలీసులు కొండ ప్రాంతాల్లో నల్లమందు ముఠాల్ని అరెస్టు చేశారు. వీరికి సహకరిస్తున్న కుకీల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే పంటలు పండిస్తున్న వారంతా కుకీలు కాగా దీన్ని ఇతర మార్కెట్లకు తరలించి విక్రయిస్తున్న వారిలో అత్యధికులు మైతేయలున్నట్లు గుర్తించారు. ఈ వర్గాలకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాల్తో సంబంధాలున్నట్లు కూడా తేలింది. వాస్తవానికి గిరిజన హోదా అనుభవిస్తున్నా కుకీలు, నాగాలు తీవ్ర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. కూరగాయల సాగు, వన్యప్రాణుల వేటపైనే వీరెక్కువగా జీవిస్తున్నారు. వీరిలో మాదకద్రవ్యాల అలవాటు కూడా ఎక్కువే. అలాగే కుకీల్లో ఎయిడ్స్‌ కూడా విస్తారంగా ఉంది. దీంతో ఈ జాతికి చెందిన యువత నిర్వీర్యమైంది. ఈ పరిస్థితుల్లో కొండ ప్రాంతాల్లోంచి వారందర్నీ బలవంతంగా తరలిం చేందుకు అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా సహకారం కలిగిన ఉగ్రవాద సంస్థల హస్తం కూడా ఈ ఘర్షణల వెనుకుండొచ్చన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement