Sunday, May 5, 2024

ఈ వారం ఎలిమినేష‌న్ పై నెటిజ‌న్స్ టాక్..

ఆదివారం వ‌స్తోందంటే చాలు బిగ్ బాస్ లో నామినేష‌న్ ర‌చ్చ కొన‌సాగ‌నుంది. మ‌రి ఈ వారం ఎవరెవ‌రు నామినేష‌న్స్ లో ఉన్నారో చూద్దాం. ఈ వారం మరో కంటెస్టెంట్ బిగ్‌బాస్‌ హౌజ్‌ను వదిలి వెళ్లడానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం జరగబోయే ఎపిసోడ్‌లో ఒక కంటెస్టెంట్‌ గుడ్‌బై చెప్పనున్నారు. దీంతో ఎలిమినేట్‌ అయ్యేది ఈ కంటెస్టెంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు తెగ హల్చల్‌ చేస్తున్నాయి. కాగా ఈ వారం నామినేషన్‌లో సిరి, రవి, సన్నీ, మానస్‌, కాజల్‌లు నామినేషన్‌లో ఉన్నారు. ఈ ఐదుగురిలో నుంచి కాజల్‌ హౌజ్‌ను వీడి వెళ్లనుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనికి ఓ కారణం ఉంది. గత కొన్ని రోజులుగా కాజల్‌ హౌజ్‌లో యాక్టివ్‌గా ఉండడం లేదని, ఆటలో వెనకబడిపోయిందని బలంగా వినిపిస్తోంది. హౌజ్‌మేట్స్‌ కూడా కాజల్‌ను వరస్ట్‌ ఫర్ఫామర్‌గా ఎన్నికుని జైలుకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి హౌజ్‌ను వీడేది కాజల్‌ అన్న వార్తలకు బలం చేకూరింది. ఇక నామినేషన్‌లో ఉన్న రవి, సన్నీలకు మంచి ఓటింగ్ వస్తుంది. కాబట్టి కాజల్‌, సిరిలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని చర్చ జరుగుతోంది. అయితే షణ్ముఖ్‌ ఎలిమినేషన్‌లో లేడు కాబట్టి.. అతనికి పడాల్సిన ఓట్లన్నీ సిరికి పడతాయని, ఈ కారణంగానే కాజల్‌ కథ ఈసారి కంచికి చేరుతుందనే టాక్ వినిపిస్తోంది. ఏమ‌వుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement