Tuesday, April 16, 2024

Down to Earth: నాడు 10 వేల సంపాదన.. నేడు కోట్ల‌కు అధిప‌తి.. ఈ త‌రం యూత్‌కి ఇన్‌స్పిరేష‌న్‌..

ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ 18వేల కోట్ల రూపాయ‌లు. వ్యాపారంలో ఎటువంటి కుటుంబ నేపథ్యం లేదు. భారీ నగదు పెట్టుబ‌డి పెట్ట‌లేదు. ఇంగ్లిష్‌పై పట్టు లేనప్పటికీ ఓ బిలియనీర్‌ స్థాయికి ఎదిగిన ఆయ‌న ప్రస్థానం అంద‌రూ తెలుసుకోవాల్సిందే. అత‌ని విజయం నేటి త‌రం యువత ఆద‌ర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.

కాలేజీలో లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం చేసుకోలేని ప‌రిస్థితి ఆయ‌న‌ది.. హిందీ మీడియం ఇబ్బందులు అప్ప‌ట్లో అలా ఉండేవి మ‌రి. త‌న సోదరి పెళ్లి కోసం అప్పులపాలై రోడ్డున పడేలా చేసిన కుటుంబ బాధ్యతలు.. భారీ వడ్డీలతో బ్యాంకు అప్పు కార‌ణంగా తొలి స్టార్టప్‌ కంపెనీని అమ్మేయాల్సిన ప‌రిస్థి వ‌చ్చింది. ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నా.. పట్టుదలతో ఒక్కో సమస్యని ప‌రిస్క‌రించుకుంటూ.. ఇప్పుడు ఏకంగా రూ.18,300 కోట్ల రూపాయల విలువైన కంపెనీని స్థాపించారు.. ఆయ‌నే దీ గ్రేట్ పేటీఎం అధినేత విజయ్‌ శేఖర్‌ శర్మ.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ సొంతూరు. అత‌ని తండ్రి స్కూల్‌ టీచర్‌. తండ్రికి వచ్చే జీతం కుటుంబ పోషణకి తప్ప మరే ఇతర అవసరాలు తీర్చేందుకు సరిపోయేది కాదు. స్పోర్ట్స్ అంటే ఎంతో ఇంట్ర‌స్ట్ అయినా.. ఫైనాన్షియ‌ల్ బ‌ర్డెన్స్ ఆట‌లాడ‌కుండా మధ్యలో అడ్డుకున్నాయి. టీచరు కొడుకు కావడంతో స్ట‌డీలో మాత్రం ఫాస్ట్‌గా ఉండేవాడు. స్కూల్‌లో ఏ ఎగ్జామ్స్ జ‌రిగినా త‌నే ఫస్ట్‌ వచ్చేవాడు. చదువులో అతని ప్రతిభకు త‌గిన విధంగానే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో కాలేజీలో సీటు వచ్చింది.

రూటు మార్చిన కాలేజీ..
త‌ను అన్నింటిలో ఫాస్ట్ అయినా ఇంగ్లిష్‌లో కాస్త పూర్ అనే చెప్పాలి. ఢిల్లీ వ‌ర్సిటీలోని క్లాస్‌ రూమ్‌, కాలేజీ క్యాంటీన్‌, గ్రౌండ్‌, ఎగ్జామ్స్‌.. ఇట్లా క్యాంపస్‌లో ఎక్కడికి వెళ్లినా త‌న‌ను ఇంగ్లిష్ తెగ ఇబ్బంది పెట్టేది. దాన్నుంచి తప్పించుకునే మార్గం లేదని.. ఎలాగైనా నేర్చుకోవాలని విజయ్‌ ఫిక్స్‌ అయ్యాడు. ఇంగ్లిఫ్‌పై పట్టు సాధించేందుకు రెగ్యులర్‌గా ఇంగ్లిష్‌ న్యూస్ పేప‌ర్స్‌, బుక్స్‌ చదవడం అలవాటు చేసుకున్నాడు. ఇందులో ఫోర్బ్స్‌ పత్రికలో వచ్చే బిల్‌గేట్స్‌, స్టీవ్‌జాబ్స్ వంటి ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంటర్వ్యూలు శేఖర్‌పై ప్రభావం చూపాయి. గొప్ప కంపెనీలన్నీ గ్యారేజీల నుంచే ఎదిగాయనే విషయం అత‌నికి అర్థమైంది. అంతే బీటెక్‌ పట్టా పుచ్చుకుని ఏదైనా జాబ్‌ చేయాలనే లక్ష్యం మారిపోయింది. త‌నో బ‌డా వ్యాపారవేత్తగా మారాలనే ఆంకాంక్ష అత‌ని మ‌దిలో గ‌ట్టిగా నాటుకుపోయింది.

- Advertisement -

కష్టాల నుంచే
సామాన్యులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు పెడుతున్న ఇబ్బందులు, సేవలు అందించే విషయంలో ప్రభుత్వ ఆఫీసుల్లో సిబ్బంది చూపించే నిర్లక్ష్యం విజయ్‌ని కలచివేశాయి. ఈ ఇబ్బందులను తొలగిస్తూ ప్రజలకు సర్వీస్‌ అందించేలా మ‌రేదానా చేస్తే బాగుంటుందన్న‌ ఐడియా వ‌చ్చింది. అప్పుడ‌ప్పుడే ఇంటర్నెట్‌కు జ‌నం అల‌వాటుప‌డుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మీ సేవా వంటివి ఏర్పాటు అవుతున్నాయి. వీటన్నింటిని గ‌మ‌నించి 2010లో పేటీఎంకు రూపకల్పన చేశారు విజ‌య్‌. ఫోన్ రీచార్జ్‌, కరెంటు బిల్లులు, ట్యాక్సులు ఇలా అనేక ఆర్థిక లావాదేవీలు ఈజీగా చేసుకునేలా పేటీఎంని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు.

పెద్ద నోట్ల ర‌ద్దుతో…
2016లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్‌ పేటీఎంని మ‌రింత జ‌నాల్లోకి చేరువ చేశాయి. ఒకటి జియో నెట్‌వ‌ర్క్ విస్తృతంగా మొబైల్ డేటా అందుబాటులోకి తేవ‌డం, రెండోది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ పెద్ద నోట్ల రద్దు అంశం. ఈ రెండు కూడా పేటీఎం బిజినెస్‌ని అనూహ్యంగా పెంచేశాయి. టీ షాపు నుంచి బడా బిజినెస్ దాకా అందరికీ పేటీఎం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 2017 నవంబర్‌ వచ్చేసరికి పేటీఎంకు రెండు కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లుగా మారారు. స్టార్టప్‌ కాస్తా యూనికార్న్‌​ కంపెనీగా మారిపోయింది. కంపెనీ పెట్టిన ఏడేళ్లకే బిలియనీర్‌ అయ్యారు విజ‌య్ శేఖ‌ర్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట్టర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement