Saturday, April 27, 2024

భారత్‌లో డిజిటల్‌ పరుగులు.. పెరిగిన ఆన్‌లైన్‌ లావాదేవీలు: కణ్వ్‌ పండిట్‌

కరోనా కారణంగా అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని, ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సంస్కరణలు జరిగాయని ఎఫ్‌ఐఎస్‌, ఆసియా పసిఫిక్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కణ్వ్‌ పండిట్‌ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ డిజిటల్‌ దిశగా పరుగులు పెడుతోందన్నారు. కరోనా సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను కూడా పెంచింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ఎంతో కీలకంగా మారింది. రోజువారీ జీవితాలను మార్చేందుకు.. సౌకర్యవంతమైన ఆర్థిక లావాదేవీల కోసం డిజిటల్‌ రంగం అవసరం పెరిగింది. కరోనా కాలంలో నగదు లావాదేవీలు భారీగా పడిపోయాయి. బ్యాంకు సేవలను వినియోగించుకునే వారు కరువయ్యారు. నగదు పొందడం కష్టంగా మారడమే దీనికి కారణం.


కరోనాతో ఆర్థిక ఇబ్బందులు
ఈ కారణంగా కరోనా సంక్షోభ సమయంలో తమ లావాదేవీలను నిర్వహించుకోలేకపోయారు. ఇప్పుడు ఈ ప్రపంచం మహమ్మారి ప్రభావం నుంచి బయటపడుతున్నది. ఆర్థిక సంస్థలతో పాటు కార్పొరేట్‌ కంపెనీలు కూడా ఇప్పుడు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో వారు సమాజంలో ఆర్థిక అసమానతల సమస్యకు తగిన పరిష్కారం చూపగలిగారు. ఆర్థిక సమ్మిళిత ప్రపంచం వైపు ప్రయాణించేందుకు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో వ్యవస్థలో ఉన్న చారిత్రక, దైహిక సమస్యలను పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరం. అయితే ఆసక్తికరంగా కార్పొరేట్‌ బోర్డు రూమ్స్‌లలో ఈఎస్‌జీ చుట్టూ ఉన్న సంభాషణలు మారుతున్నాయి. ఆర్థిక చేర్పు అనేది ఈఎస్‌జీలో ఎస్‌గా మారడంతో పాటుగా సామాజిక ప్రభావ అంశం ఇప్పుడు బోర్డు ఎజెండాలో అగ్ర స్థానంలో ఉంది. ఆర్థిక సంస్థలు తప్పనిసరిగా మహమ్మారి అనంతర ప్రపంచంలో తమ వినూత్నమైన వ్యూహాలను పున:పరిశీలించాల్సి ఉంది. క్లిష్టమైన ఆర్థిక సేవల కోసం సౌకర్యవంతమైన ప్రాప్యతతో విస్తృత స్థాయిలో సమాజాన్ని శక్తివంతం చేయడానికి సరికొత్త సాంకేతికతలు నిర్మించబడ్డాయని నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. డిజిటల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కోసం నూతన ఉత్పత్తులు, సేవలను ఆర్థిక సంస్థలు జోడించుకోవాల్సి ఉంది.

కేంద్ర పథకాలతో గణనీయమైన మార్పు
అవగాహనను బ్యాంకు ఖాతాలను సరిగా వినియోగించని వారికి అందించడం ద్వారా తమ బ్యాంకింగ్‌ ఆప్టిట్యూడ్‌, యోగ్యత వృద్ధి చేయవచ్చు. తమ ఆర్థిక చేర్పు లక్ష్యాలను అందుకోవడంలో భారతదేశం సగం దూరం మాత్రమే చేరుకోగలిగిందని భారత్‌ రిజర్వు బ్యాంకు అభివృద్ధి చేసిన నూతన సూచీలు వెల్లడిస్తున్నాయి. ఆర్‌బీఐ వార్షిక ఆర్థిక చేర్పు (ఎఫ్‌ఐ) ఇండెక్స్‌ వెల్లడించే దాని ప్రకారం.. భారత్‌ 53.9 వద్ద నిలిచింది. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇది కేవలం సగం మీద కొద్దిగ మాత్రమే దాటింది. పూర్తి ఫైనాన్షియల్‌ స్కోర్‌ 100కు చేరుకోవడం ఇంకా దూరంలో ఉంది. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ (జామ్‌) పర్యావరణ వ్యవస్థ గణనీయమైన మార్పును ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ (ఎఫ్‌ఐ) ప్రపంచంలో తీసుకువచ్చింది.

డిజిటల్‌ ఆర్థిక సేవల విస్తరణ
సాంకేతికత స్వీకరణ, వికాసం అనేవి గణనీయమైన వృద్ధికి తోడ్పడటంతో పాటుగా డిజిటల్‌ ఆర్థిక సేవల విస్తరణకు తోడ్పడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో డిజిటల్‌ మౌలిక వసతులను అందించడం కోసం ప్రారంభించింది. వీటిలో పలు ఆర్థిక చేర్పు పథకాలైన.. ప్రధాన్‌మంత్రి జన్‌ ధన్‌ యోజన (పీఎంజెడీవై), అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై), ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), ప్రధాన్‌మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), సుకన్య సమృద్ధి యోజన ఉన్నాయి. మొబైల్‌ చెల్లింపులు అత్యంత సహజంగా మారాయి. అర చేతిలో సాంకేతికను వినియోగించుకుంటున్నారు. అయినా.. చాలా మందికి స్మార్ట్‌ఫోన్‌, డిజిటల్‌ చెల్లింపుల సదుపాయం ఉండకపోవచ్చు. ఆర్థిక సంస్థలకు కీలక బాధ్యతలు ఉన్నాయి. అవి లావాదేవీల అవసరాలతో పాటు బ్యాంకు ఖాతాలకు దూరంగా ఉన్న ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement