Thursday, April 25, 2024

ఎమ్మెల్యేకే ఇబ్బందులు ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ?.. డీసీపీ రక్షితపై సీతక్క ఆగ్రహం

లాక్ డౌన్‌లో కొందరు పోలీసులు వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీతక్క తల్లి కరోనా బారిన పడడంతో హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో సీతక్క తల్లికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు బ్లడ్ అవసరం అవ్వడంతో సీతక్క బంధువులు ములుగు నుంచి బ్లడ్ డొనేట్ చేయడానికి పర్మిషన్ తో వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని హైదరాబాద్‌లో కొందరు పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అత్యవసరంగా బ్లడ్ డొనేట్ చేసేందుకు వెళ్తున్నామంటే కూడా వినకుండా వారిని మల్కాజిగిరి డీసీపీ రక్షిత అడ్డుకున్నారని సీతక్క ఆరోపించారు. అంతేకాకుండా వారితో దురుసుగా మాట్లాడుతూ అర్ధగంట సేపు పక్కకు నిలబెట్టారన్నారు. తాను వీడియో కాల్ చేసిన డీసీపీ మాట్లాడే ప్రయత్నం చేయలేదన్నారు. ”డోంట్ టాక్ రబ్బిష్” అంటూ తన వాళ్లపై డీసీపీ రక్షిత మండిపడ్డారని తెలిపారు.

ఎమ్మెల్యే అయిన తనకే ఈ విధంగా ఇబ్బందులు ఎదురైతే .. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి ? అని ఒక్కసారి ఆలోచించాలని సీతక్క అన్నారు. డీసీపీ రక్షిత డ్యూటీ ముగిశాక ఆమె స్థానంలో వచ్చిన మరో పోలీస్ అధికారి.. మానవతా దృక్ఫధంతో తమ వారిని అక్కడ్నుంచి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారన్నారు. అందరిపట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని సీతక్క పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement