Saturday, May 18, 2024

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్‌ సక్సెస్.. నాలుగు రోజుల టూర్‌లో ఏం చేశారంటే..

ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగురోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. ఎందుకు వెళ్లారో, అజెండా ఏమిటి అన్న‌ది ఎవ‌రికీ తెలియదు. ఢిల్లీలో కేసీఆర్ ఏం చేశారు, ఏమి సాధించారో అన్న విష‌య‌మ్మీద‌నే ఇప్పుడంతా చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. సమర్ధత, చాకచక్యం, చాణక్యం కలిగిన ముఖ్యమంత్రి ఉంటే.. కాలు కదల్చకుండా, ఒక్క రాజకీయనాయకుడుని, మంత్రిని కూడా కలవకుండా, సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ఈజీగా ప‌రిష్క‌రించ‌వ‌చ్చ‌నే విష‌యం తెలుస్తోంది.

ప్రపంచంలోనే మానవనిర్మిత మహాద్భుతంగా అంతర్జాతీయంగా కొనియాడిన‌ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ సుమారు 80వేల కోట్ల‌ రూపాయల వ్యయంతో కేవలం మూడున్నరేళ్లలో పూర్తిచేశారు. వినియోగంలోకి తెచ్చారు. సీఎం కేసీఆర్ దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి రికార్డ్ వేగంతో పూర్తి చేయించారు. కాళేశ్వరం పుణ్యమా అని దానికి అనుబంధంగా నిర్మించిన‌ రిజర్వాయర్లు, పూడికలు తీసిన‌ చెరువులు, కాలువల కారణంగా ఇవ్వాల‌ తెలంగాణలో భూగర్భజలాల మట్టం పెరిగి నీటికరువు అన్నది లేకుండా పోయింది. ఆఫ్ కోర్స్.. ఎనిమిదేళ్లుగా వరుణదేవుడి కటాక్షం కూడా బాగానే ఉన్న విష‌యం మ‌రిచిపోవ‌ద్దు.

ఇక‌.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల నుంచి రావలసిన లోన్ మొత్తాలు చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం అనేక కొర్రీలు వేస్తూ వీటిని అడ్డుకుంటున్నది. కేంద్రం లేవనెత్తిన సందేహాలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో క్యాంప్‌ వేశారు. చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణారావు, ఇరిగేషన్ సెక్రెటరీ రజత్ కుమార్ ఇంకొంద‌రు ఉన్నతాధికారులతో ఢిల్లీలో సమావేశాలు, సమీక్షలు పెట్టి కేంద్ర అధికారులతో మాట్లాడి వారికి మన అధికారులతో సమాధానాలు ఇప్పించి కేంద్ర అధికారులను ఒప్పించి పెండింగ్ లోన్స్ రిలీజ్ కావడానికి అనుమతులను సాధించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల అధికారులతో మన అధికారులు సంప్రదించి మార్గాన్ని సుగమం చేశారు. కేంద్ర అధికారులతో తమ చర్చలు ఫలించాయని, రాష్ట్రానికి రావలసిన పెండింగ్ లోన్ డబ్బును సాధ్యమైనంత త్వరగా విడుదల చెయ్యడానికి ఒప్పుకున్నారని రాష్ట్ర అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ
నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్ రాజకీయనాయకులను, కేంద్రమంత్రులను ఎవ్వరినీ కలవలేదు. బతిమాలలేదు. రికార్డులు, గణాంకాల ఆధారంగా కేంద్ర అధికారులను ఒప్పించి తెలంగాణకు భారీప్రయోజనాలు సాధించిపెట్టారు. అయినా.. దీన్ని ఘనకార్యంగా ప్రచారం చేసుకోకపోవడమే “కేసీఆర్” గొప్పదనం.. అంటున్నారు చాలామంది పార్టీ లీడ‌ర్లు, అభిమానులు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement