Friday, June 14, 2024

ఖ‌బ‌ర్థార్ మోడీ – త‌గ్గేదే లే – సీఎం కేసీఆర్

పైస‌లు ఇవ్వ‌కున్నా ఎనిమిదేళ్లల్లో కేంద్రంతో ఎన్న‌డూ గొడ‌వ‌పెట్టుకోలేద‌ని సీఎం కేసీఆర్ జ‌న‌గామ బ‌హిరంగ స‌భ‌లో అన్నారు. నిధులు ఇవ్వ‌కున్నా క‌డుపుక‌ట్టుకొని ప‌నిచేశామ‌న్నారు. కేంద్రం కొన్ని స‌మ‌స్య‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ఖ‌బ‌డ్దార్ మోడీ అన్నారు. మ‌మ్మ‌ల్ని ముట్టుకుంటే అడ్ర‌స్ లేకుండా చేస్తామ‌న్నారు. న‌రేంద్ర‌మోడీ జాగ్ర‌త్త ..నీ ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డ‌మ‌న్నారు కేసీఆర్. క‌రెంట్ సంస్క‌ర‌ణ పేరుతో న‌రేంద్ర మోడీ పంచాయితీ పెడుతున్నార‌న్నారు. న‌రేంద్ర‌మోడీ పొలాల ద‌గ్గ‌ర మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాలంటున్నారు. న‌న్ను చంపినా మీట‌ర్లు పెట్ట‌న‌ని చెప్పాన‌న్నారు. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట మీట‌ర్లు పెట్టాలా..మీరు పండించే ధాన్యం కొనం అంటున్నారు…వాట్సాప్ ల‌లో దొంగ ప్ర‌చారాలు చేస్తున్నారన్నారు. కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే శ‌క్తి వ‌స్తే..దేశం గురించి కొట్లాడేందుకు వెనుకాడమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement