Saturday, April 20, 2024

TRS Mahadharna: కేంద్రంలో దిక్కుమాలిన సర్కార్.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఘోరం

కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధార్నలో పాల్గొన్న సీఎం.. కేంద్ర విధానాలపై నిప్పులు చెరిగారు. కేంద్రం వాస్తవాలు చెప్పలేక అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. రైతులను కేంద్రం బతకనిస్తుందా ? లేదా ? అని ప్రశ్నించారు. దేశంలో సగం జనాభా రైతులపైనే ఆధారపడి ఉందన్నారు. హంగర్‌ ఇండెక్స్‌లో భారత దేశం 101 స్థానంలో ఉందని తెలిపారు. పాకిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ దీన స్థితిలో ఉందని తెలిపారు. తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా?: కేసీఆర్ పై సీతక్క ఫైర్

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement