Friday, May 3, 2024

క‌ర్ర‌లు .. మార‌ణాయుధాల‌తో చెడ్డీగ్యాంగ్ హ‌ల్ చ‌ల్ ..

ఓ అపార్ట్ మెంట్ లోకి దొంగ‌ల ముఠా ఎంట‌ర‌యింది. క‌ర్ర‌లు , మార‌ణాయుధాల‌తో హ‌ల్ చ‌ల్ చేసిందా ముఠా.. ఆ ముఠా చెడ్డీ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు.. ఈ సంఘ‌ట‌న విజ‌య‌వాడ న‌గ‌ర శివారు ఇబ్ర‌హ్నీంప‌ట్నం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్ లో అలికిడి కావడంతో ఓ ఫ్లాట్ యజమాని లైట్లు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. దొంగల కదలికలు ఆ అపార్ట్ మెంట్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చెడ్డీగ్యాంగ్ కదలికలతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement